25-02-2025 03:04:24 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన సర్వే నిర్వహిస్తుంది. గతంలో జరిగిన బీసీ కులాల సర్వేలో పాల్గొనలేని వారు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కుల గణన సర్వేలో భాగంగానే బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ మంగళవారం పాల్గొని, ఇవాళ బౌద్ధ నగర్, సీతాఫల్మండి డివిజన్లలో నిరంజన్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే వివరాలు ప్రజల నుండి తెలుసుకొని కులగణన సర్వే కానీ ఇంటికి ఏమ్యునరేటర్లను పంపి సర్వే చేయించారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆదాం సంతోష్ కుమార్ మాట్లాడుతూ... ప్రతి ఒక్క కుటుంబం కుల గణ సర్వేలో పాల్గొనాలని ఒకవేళ సర్వేలో భాగంగా అందుబాటులో లేనివారు 040 21111111 నంబర్ కి ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ(NSUI) మాజీ ఉపాధ్యక్షులు ఆదాం సృజన్ కుమార్, జలంధర్ రెడ్డి, షకీల్ ఖాన్ అనిల్ కుమార్, వాయిదుద్దీన్ లడ్డు, ప్రతాప్, చక్రధర్, బబ్లు, కుద్దూస్ శేఖర్, శోభ, రాధా, కల్పన, కిరణ్, మహేష్, ప్రేమ్, బాలరాజ్, బ్రహ్మాజీ, నిస్సార్, రమేష్, జనార్ధన్, ఆమెర్ తదితరులు పాల్గొన్నారు.