బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికలో కొత్తదనం ఏమీలేదని, దాంతో బీసీలకు ఉపయోగమే లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో మంగళవారం మీడియ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి శాస్త్రీయత, అవగా హన లేకుండా, అధ్యయనం చేయకుండా ఒక తప్పును తప్పించుకోవడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. బీసీ డెడికేషన్ కమిషన్ 3నెలల 6రోజుల పాటు అధ్యయనం చేసి 50పేజీల రిపోర్టునిచ్చిందన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన సీట్లను బీసీలకు ఇవ్వాలని పాతపాటే పాడిందని ఆరోపించారు. బీసీలను రాజకీయంగా అణచివేసేలా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా మార్చి 9న హైదరాబాద్‌లో వేలాది మందితో బీసీ కులగణన రణభేరి సభ నిర్వహించబోతున్నట్లు తెలిపారు.
పార్టీలు, జెండాలను పక్కన బెట్టి లక్షలాదిగా ఈ సభకు తరలిరావాలన్నారు. సెక్రటేరియట్‌లో బీసీ ఎమ్మెల్యేలు, మంత్రు లు, సలహాదారుల సమక్షంలో బీసీ సంఘా ల నాయకులు 4గంటలపాటు కులగణన నివేదికపై చర్చించామని, అది గడిచి 48గంటలైనా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు.
కాగా ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశం లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్,బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు శ్యామ్‌కురుమ, బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు మణిమంజరి, బీసీ సంక్షేమ సం ఘం గ్రేటర్ అధ్యక్షుడు మాదేసి రాజేందర్, మహిళా అధ్యక్షురాలు శ్యామల, నాయకులు సందీప్ పాల్గొన్నారు.