calender_icon.png 4 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ కులగణన సరిగా జరగలేదు

04-02-2025 01:18:15 AM

*  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కరీంనగర్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సరిగా జరగలేదని ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌లోని జ్యోతిబాఫులే విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత కమాన్ వద్ద కమాన్ ఫార్మసీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డెడి  కమిషన్ ఏర్పాటు చేసిందని.. కానీ, బీసీగణన సరిగా జరగలేదన్నారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకేరోజు విజయవంతంగా నిర్వహించారని అన్నారు. బీసీల జనాభా కేవలం 46.2 శాతం మాత్రమే ఉందా అని ప్రశ్నించారు.

మీ నాయకుడు రా  చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకొని 56.3 శాతం బీసీలకు వెంటనే బీసీ రిజర్వేషన్లు పెట్టి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తుందన్నారు. కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్  తదితరులు పాల్గొన్నారు.