రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, జనవరి 4 : పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాం చేశారు. శనివారం కాచిగూడలోని ఓ హోటల్‌లో ఆంధ్ర రాష్ట్ర కురుబ, కురుమ, కురుప సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈనెల 23న మదనపల్లిలో నిర్వహించతలపెట్టిన ‘కురు మహాసభ’ కు సం వాల్‌పోస్టర్‌ను ఆయన పలు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.