31-03-2025 01:20:19 AM
ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరుగర్జన మహాధర్నా
రాజకీయపార్టీల నేతలందరూ హాజరుకావాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్‌లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే బీసీల పోరుగర్జన సభకు అఖిలపక్షపార్టీల నేతలు హాజరై బీసీలకు అండగా నిలబడాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆయా రాజకీయ పార్టీల నేతలను కలిసి కోరారు. అసెంబ్లీలో బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ పెంచుతూ చేసిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో ఆమోదించి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీని కలిసి ఆహ్వాన పత్రాలు అందించారు. దేశవ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, దీంతోపాటు పార్లమెంట్ బీసీ బిల్లును ఆమోదించాలని కోరారు. అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు భేషరతుగా మద్దతు తెలిపాయని.. ఆ పార్టీలన్నింటికి కృతజ్ఞతలు తెలిపారు.