calender_icon.png 2 November, 2024 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి

19-07-2024 01:02:28 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బీసీ బిల్లుపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీల అభివృద్ధికి 2లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో గురువారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో నిర్వహించిన బీసీ సంఘాలు, కుల సం ఘాలు, ఉద్యోగ సంఘాల సదస్సులో ఆయ న మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 6న ‘ఛలో పార్లమెంట్’ చేపడుతున్నామన్నారు. బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, ప్రపంచంలో ఏ దేశ మూ మెజార్టీ ప్రజలను ఇలా అణచిపెట్టడం లేదన్నారు.

భారత్‌లో పేరుకే ప్రజాస్వామ్యమని, కానీ ప్రభుత్వాలు ఆచరణలో ప్రజా స్వామ్య స్ఫూర్తిని చాటడం లేదని వాపోయారు. రాజ్యాంగంలో పేర్కొన్న సమాన త్వం, సామాజిక న్యాయం 76 ఏండ్ల తరువాత కూడా అమలు కాకపోవడం శోచనీ యమన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీల జనాభా ప్రకారం వాటా ఇచ్చే విధంగా పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాలన్నారు. రాష్ట్రప్రభుత్వం కూడా రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చక పోతే మున్ముందు బీసీ సంఘాలంతా కలిసి తెలంగాణ ఉద్యమంలా ఉద్యామాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఢిల్లీలో చేపట్టనున్న ఛలో పార్లమెంట్‌కు ధర్నాకు ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ, రాష్ట్రీయ జనతాదళ్, డీఎంకే, జనతా దళ్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ తదితర పార్టీలను ఆహ్వానిస్తామన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీలు అన్ని రంగాలలో రాణించా లంటే తక్షణం కులగణన చేపట్టాల్సి ఉందన్నారు. అనంతరం నాయకులు ఛలో పార్ల మెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ ముదిరాజ్, వేముల రామకృష, లక్ష్మణ్, గొరిగె మల్లేష్ యాదవ్, ఉదయ్, రాందేవ్, మట్టా జయంతి పాల్గొన్నారు.