calender_icon.png 10 October, 2024 | 10:03 PM

బజార్ స్టైల్ ఐపీఓ ధరల శ్రేణి రూ.370-389

27-08-2024 12:00:00 AM

ముంబయి: ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ సంస్థ బజార్ స్టైల్ రిటైల్ లిమిటెడ్.. ఐపీఓ  ధరల శ్రేణిని కంపెనీ సోమవారం ప్రకటించింది.

* ఒక్కో షేరు ధరను రూ.370-389గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 3న ముగియనుంది. మదుపర్లు రూ.14,782తో కనీసం 38 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఈ ఐపీఓలో  రూ.148 కోట్ల విలువ చేసే కొత్త షేర్లతో పాటు రూ.687 కోట్లు విలువ చేసే 1.76 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించనున్నారు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.835 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ప్రముఖ దివంగత మదుపరి రాకేశ్ ఝుంఝన్‌వాలా సతీమణి రేఖా ఝుంఝన్‌వాలాకు ఈ కంపెనీలో వాటాలున్నాయి. ఈ ఐపీఓలో ఆమె ఓఎఫ్‌ఎస్ ద్వారా కొన్ని వాటాలు విక్రయి స్తున్నారు. ఇంటెన్సివ్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటెన్సివ్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైతం కొన్ని వాటాలను ఈ ఐపీఓలో అమ్మకానికి ఉంచుతున్నాయి.

* పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రముఖ వాల్యూ రిటైల్ మార్కెట్లలో బజార్ స్టైల్ రిటైల్ ఒకటి. అస్సాం, బిహార్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, ఉతరప్రదేశ్, ఛతీస్‌గఢ్ మార్కెట్లపైనా ఈ సంస్థ దృష్టి సారించింది. 2023--24లో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.972.88 కోట్లుగా నమోదైంది. పన్నుల తర్వాత లాభం రూ.21.94 కోట్లుగా నివేదించింది.