11-04-2025 01:49:10 AM
కేంద్రహోంశాఖ స్పష్టీకరణ
వెలుగులోకి వచ్చిన విభజన సమస్యలపై సమావేశం మినిట్స్
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ అంశాన్ని కేంద్ర ఉక్కుశాఖ 2024 నవంబర్ 28న జరిగిన సమావేశంలో స్పష్టం చేసినందున తెలంగాణ ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థలతో కలిసి ఏర్పాటుచేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచిం చింది.
విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌మోహన్ ఫిబ్రవరి 3న ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించగా, తాజాగా ఆ సమావేశం మినిట్స్ వెలుగులోకి వచ్చాయి.
మినిట్స్‌లోని ప్రధాన అంశాలు ఇవే..
హైదరాబాద్ మధ్య ఎన్‌హెచ్ ఆరు వరుసలుగా విస్తరించే అం శంపై చర్చించారు. డీపీఆర్ ప్రక్రియ ప్రారంభించామని, అదనంగా భూసేకరణ అవస రమని కేంద్ర రహదారి, రవాణశాఖ కార్యదర్శి తెలిపారు. హోంశాఖ కార్యదర్శి ఈ విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఎన్‌ఎచ్ హైదరాబాద్ ఓఆర్‌ఆర్ సెక్షన్‌ను 4 వరుసలుగా విస్తరిం చే అంశంపై చర్చించారు. ఇప్పటివరకు హరిత ట్రైబ్యునల్‌లో ఉన్న కేసు పరిష్కారమైనందున రహదారి విస్తరణ పనులు చేపడతామన్నారు.
రాష్ట్రంలో రైలు అనుసంధాన సమస్య గురించి ప్రధాన కార్యదర్శి ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్క వరంగల్ మినహాయించి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు రైలు అనుసంధానం పెద్దగా లేదని చెప్పా రు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు ఒక సింగిల్, 15 డబ్లింగ్ ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు బదులిచ్చారు. అందులో 2,139 కిలోమీటర్ల పొడవైన 10ప్రాజెక్టులు వినియోగంలోకి వచ్చాయని వెల్లడించారు.
ఎన్‌టీపీ ఏర్పాటు చేయాల్సిన 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లలో ఇప్పటివరకు 2,800 మెగావాట్ల తొలిదశ ప్రాజెక్టు పూర్తు ప్రారంభమైనట్లు తెలంగాణ అధికారులు చెప్పారు. రెండో దశగా 3,800 మెగావాట్ల ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా, 800 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సుముఖత తెలి పామన్నారు. పీపీఏలపై ఎన్‌టీపీసీతో కలిసి సంతకాలు చేయాల్సి ఉందని వివరించారు.
హైదరాబాద్ హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి తక్షణం డీపీ ఆర్ తయారుచేయాలని ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర రహదారి, రవాణశాఖ కార్యదర్శి బదులిస్తూ..‘ ఇది కొత్త ప్రతిపాదన. తదుపరి కార్యాచరణ చేపట్టాలంటే ముందు ఎలైన్‌మెంట్‌కు అనుమతి రావాల్సి ఉం టుంది’ అని చెప్పారు.
వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి రూ. 2,700 కోట్ల గ్రాంట్ బకాయి ఉందని తెలంగాణ అధికారులు ప్రస్తావించగా, దీన్నీ నీతిఆయోగ్ దృష్టికి తీసుకెళ్లాలని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
విభజనచట్టంలో పేర్కొన్న 12 సంస్థల విభజనపై కేంద్ర హోంశాఖ తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ ప్రతినిధులు చేసిన వి జ్ఞప్తిపై అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలి గోవింద్ మోహన్ నిర్ణయించారు.
హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం ఎలైన్‌మెంట్ పూర్తయింది. డీపీఆర్ 4 నెల ల్లో పూర్తవుతుంది. విభజన అనంతరం తెలంగాణలో హైవేల విస్తరణ రెట్టింపైంది. హైదరాబాద్ 4 వరుసల ఎలివేటె డ్ కారిడార్ ఎలైన్‌మెంట్ పూర్తయింది. హై దరాబాద్ కల్వకుర్తి హైవే విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి’అని కేంద్ర రహదారి రవాణశాఖ అధికారులు తెలిపారు.
విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొ న్న సంస్థల ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నిధులతోనే సృష్టించినం దున వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశా ఖకు స్పష్టం చేసింది.