calender_icon.png 7 January, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన విద్యార్థులు సివిల్స్ సాధించాలని కోరుకుంటున్నా

05-01-2025 11:44:20 AM

హైదరాబాద్: మన విద్యార్థులు సివిల్స్ ఇంటర్వ్యూలో పాసైతే అంతకుమించిన ఆనందం ఏముంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు. మన అభ్యర్థులు ఎంపిక కావాలని మేమంతా కోరుకుంటున్నామన్నారు. ప్రజాభవన్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించిన 20 మందకి ఆర్థిక సాయం చేస్తామన్నారు. సివిల్స్ ప్రిమిల్స్(Civil Services Prelims 2024) సాధించిన 40 మంది తెలంగాణ అభ్యర్థుల్లో 20 మంది సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్తుంటే తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. డబ్బులేని కారణంగా సివిల్స్ అభ్యర్థులు మధ్యలో ఆగిపోకూడదని సూచించారు. 20 మంది తెలంగాణ అభ్యర్థులు సివిల్స్ సాధించాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. అభ్యర్థులను ప్రోత్సహించడం ప్రభుత్వం బాధ్యతన్నారు.