calender_icon.png 18 April, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేములలో బ్యాటరీల చోరీలు

28-03-2025 12:45:37 AM

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వాహనాల యజమానులు 

మూసాపేట్, మార్చి 27: వేముల గ్రామంలో  ఇంటి ముందుల ఉంచిన వాహనాలలో బ్యాటరీలు దొంగతనాలు చేసిన సంఘటన చోటుచేసుకుంది. వాహనాల యజమానుల వివరాలు ఇలా ఉన్నాయి.

గొల్ల భాగన్నకు సంబంధించిన డీసీఎం ts06uc7434, బోయ నర్సింలుకు సంబంధించిన సోనాలిక నూతన ట్రాక్టర్, కృష్ణారెడ్డి కి సంబంధించిన భారత్ బెంజ్ వాహన నెంబర్ ts06uc 5239 వాహనాలలో మూడు బ్యాటరీలను ఈనెల 26 తేదీన అర్ధరాత్రి చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.

చోరికి పాల్పడిన వారిని గుర్తించి వెంటనే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. చోరీకి గురైన బ్యాటరీల గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొనగా ఎస్త్స్ర వేణు ఫిర్యాదు అందినట్లు తెలియజేశారు.