calender_icon.png 26 October, 2024 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్ రోడ్డుపై బెటాలియన్ కానిస్టేబుల్ భార్య పిల్లలతో కలిసి రోడ్డుపై ధర్నా

26-10-2024 04:12:38 PM

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్ పై శనివారం 3rd బెటాలియన్ కానిస్టేబుల్ భార్య పిల్లలతో కలిసి రోడ్డుపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బేటాలియన్ పోలీసు కుటుంబాలకు, పోలీసులకు స్థానిక మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం మహేశ్వరం డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్క సరిగా ఉదృతంగా మారిన ధర్నా సాగర్ రోడ్డుపై కొద్దీ సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో ఇబ్రహీంపట్నం, సాగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. బేటాలియన్ కుటుంబ సభ్యులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో మన రాష్ట్రంలోనూ ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్స్ చేశారు.

ఏక్ పోలీస్ విధానం అమలయ్యే వరకు ఫ్యామిలీ వెల్ఫేర్ సోషల్ పాటు కల్పించాలి. బ్రిటిష్ కాలం నాటి విధి విధానాలను ప్రస్తుత కాలానికి మార్చాలి. ఓకే చోట ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇచ్చి, ఫ్యామిలీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. బెటాలియన్ వ్యవస్థలో ఫటిక్ పేరుతో చేసే వెట్టి చాకిరీ నశించాలి. హోమ్ శాఖ మీ చేతుల్లోనే ఉంది. తమ బ్రతుకులు కూడా సీఎం చేతుల్లోనే ఉన్నాయి అంటూ నినాదాలు, ఫ్లకార్డ్స్ తో ప్రదర్శన చేస్తూ, ఉన్నతాధికారుల ఇండ్లలో బానిస బతుకుల నుండి విముక్తి కల్పించాలని, హోం శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి, విధి విధానాలు, జీవనశైలి ఒకే విధంగా ఉండాలని, డిమాండ్ చేస్తూ చిన్నపిల్లల రాస్తారోకో నిర్వహించారు.