మహబూబ్‌నగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న జేపీఎన్‌సీఈ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలను పేర్చి ఆడారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిదర్శనమన్నారు. కేవలం మహిళలు మాత్రమే పాల్గొనే ఈ పండుగకు ప్రత్యేకత ఉన్నదన్నారు.