calender_icon.png 11 January, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక

03-10-2024 12:39:25 AM

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 02 (విజయ క్రాంతి) ః బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. న్యూజిలాండ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవమని తెలిపారు. పువ్వులను దేవతా స్వరూపంగా పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని చెప్పారు.

బీఆర్‌ఎస్ పార్టీ చొరవతోనే బతుకమ్మ సంస్కృతి ఖండాలు దాటిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమంతో తెలంగాణ బతుకమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటామని పేర్కొన్నారు. న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో హెడ్ ఆఫ్ ఛాన్సరీ సంజీవ్‌కుమార్, వైస్ కౌన్సిల్ దివ్యాజీ, మినిస్టర్ ఆఫ్ ఎతిని హెలెన్ కరెన్ చౌర్, ఎంపీ పరమ్‌జిత్, నాయకులు కళ్యాణ్‌రావు, రామ్‌మోహన్, రామారావు, అరుణ్‌ప్రకాష్, కిరణ్ పొకాల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.