calender_icon.png 22 December, 2024 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి ఇచ్చిన పండుగ బతుకమ్మ

09-10-2024 06:38:10 PM

కొమురంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రకృతి ఇచ్చిన బతుకమ్మ పండగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ భవన సముదాయం ఆవరణలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణులతో కలిసి హాజరై గౌరమ్మ, శారదా దేవి ప్రతిమలకు పూజలు నిర్వహించి వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ వేడుక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని, భావితరాలకు అందించాలని తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారాం, జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.