calender_icon.png 9 October, 2024 | 2:00 PM

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఉద్దేశంతోనే ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

09-10-2024 11:13:01 AM

ప్రతి మండలంలో గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారులు యువత ఉత్సాహభరితమైన వాతావరణంలో 2కె రన్.

మెదక్: బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2కే రన్ విజయవంతం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం  యువజన క్రీడల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో మెదక్ స్టేడియం  చౌరస్తా నుండి రాందాస్ చౌరస్తా వరకు టూ కె రన్ నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై టు కే రన్ కార్యక్రమాన్ని జెండాతో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లాలో క్రీడాకారులు యువత పాల్గొని ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు భావితరాలకు చాటి చెప్పే విధంగాజిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగానిర్వహించుకుంటున్నారని ఈ సంబరాల్లో  భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు 2కె రన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పారు. జిల్లాలో అన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలలో పిల్లలకు వ్యాచారచన , క్రీడా పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని దసరా పండుగను తెలంగాణ ఆడబిడ్డలు పెద్ద ఎత్తున జరుపుకుంటారని  ఆ సంస్కృతిని మనం ఇంకా కొనసాగించే విధంగా ప్రచారం కల్పించే విధంగా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మహిళలకు బాలికలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లో కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి, వై దామోదర్ రెడ్డి జిల్లా పౌర సంబంధాల అధికారి కే రామచంద్రరాజు, ఇతర క్రీడాకారులు, క్రీడాకారిణులు, పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు.