calender_icon.png 5 October, 2024 | 8:54 PM

బతుకమ్మ సంబరాలు వీడియో ఆవిష్కరణ

05-10-2024 05:35:58 PM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ బాషా సాంసృతిక శాఖ, సూపధా క్రియేషన్స్ నిర్వహణలో రూపొందించబడ్డ బతుకమ్మ  సంబురాలు వీడియో పాటను సాంసృతిక , పర్యాటక శాఖ ముఖ్య  కార్యదర్శి వాణి ప్రసాద్ తన ఛాంబర్ లో ఈ శనివారం విడుదల  చేశారు. ఈ సందర్భంగా  వాణి ప్రసాద్ మాట్లాడుతూ.. బతుకమ్మ  అంటే ప్రకృతికి థాంక్స్ గివింగ్ అంటూ పూలనే దేవతలుగా పూజించే ఇలాంటి పండుగ ఎక్కడ లేదని, తెలంగాణాలో ని ప్రతి పల్లె  పూల తెరులై ఆడుతుందని  కొనియాడారు .ఈ పాట చిత్రణ  బాగుందని మెచ్చుకున్నారు.  పాటను గాయని శృతి ఆలపించగా,  సాహిత్యం డా తంగిళ్ల శ్రీదేవి రెడ్డి, సంగీతం ఎం. ఎం. శ్రీలేఖ సమకూర్చగా, నాగదుర్గ, వీణా, స్వాతి బృందం ఎంతో చక్కగా ఈ పాటలో అభినయించారని  సాంసృతిక శాఖ సంచాలకుడు డా మామిడి హరికృష్ణ మెచ్చుకున్నారు . సీనియర్ జర్నలిస్ట్ పొన్నం రవిచంద్ర , డైరెక్టర్ చేతన్ , డీవోపీ సమకూర్చిన తిరుపతి , రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .