calender_icon.png 8 October, 2024 | 5:59 PM

Breaking News

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

08-10-2024 03:24:36 PM

కామారెడ్డి (విజయక్రాంతి): బతుకమ్మ వేడుకలను ఘనంగా సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్లోని సమావేశ హాలులో బతుకమ్మ వేడుకల నిర్వాహన  పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను అధికారికంగా జిల్లాలో నిర్వహించాలని అన్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో మహిళలను పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాంప్రదాయ రైతుల పాటలు పాడుతూ బతుకమ్మ ఆటను ఆడే విధంగా మహిళలకు ఏర్పాటు చేయాలని అన్నారు.

మహిళా సంఘాల సభ్యులను బతుకమ్మ వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలని అన్నారు. చెరువులు,కుంటలు నీటి ప్రాంతాల్లో గజహితగాలను నియమించాలని సూచించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో శానిటేషన్ పనులు విద్యుత్ లైట్లను షామ్యానాలను సౌకర్యాలు కల్పించాలని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. శాఖల వారీగా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో రంగనాథరావు, డిఎస్పి నాగేశ్వరరావు, జిల్లా సంక్షేమ అధికారి బావన్న జిల్లా ప్రణాళిక అధికారి రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.