calender_icon.png 11 January, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిట్స్‌లో బతుకమ్మ వేడుకలు

06-10-2024 12:15:03 AM

కరీంనగర్, అక్టోబరు 5 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణ శివారులోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు పూల బతుకమ్మలను తీసుకువచ్చి బతుకమ్మ ఆడారు. అనంతరం సాంప్రదాయ నృత్యాలు, దాండియా ఆడారు.

ఉత్తమంగా రూపొందించిన బతుకమ్మలకు బహుమతులను, కన్సోలే షన్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిట్స్ చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జె సుమిత్‌సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్‌రావు, అకాడమిక్ డీన్ డాక్టర్ పీకే వైశాలి పాల్గొన్నారు.