calender_icon.png 1 October, 2024 | 5:06 PM

విద్యా సంస్థల్లో బతుకమ్మ సంబరాలు

01-10-2024 01:57:11 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మంగళవారం భువనగిరిలోని పలు విద్యా సంస్థల్లో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక జీనియస్ స్కూల్ లో చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో చూడ ముచ్చటగా ముస్తాబయ్యారు. వివిధ రకాల రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. గౌరమ్మను ప్రత్యేకంగా అలంకరించి బతుకమ్మల మధ్యన పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ ఆనందోత్సాహాల మధ్యలో ఆట ఆడుతూ అలరింపజేశారు.