calender_icon.png 4 October, 2024 | 8:46 PM

శ్రీ చైతన్య కళాశాలలో బతుకమ్మ సంబరాలు

04-10-2024 06:48:41 PM

సంబరంగా ఆడి పాడిన విద్యార్థులు

మానకొండూర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ పండుగను సంబరంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి బతుకమ్మను లక్ష్మీదేవిగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాల వేడుకను ప్రారంభించారు. పలువురు విద్యార్థులు బతుకమ్మను రంగురంగుల పూలతో అలంకరించి కళాశాల అధ్యాపకులతో పాటు విద్యార్థిని విద్యార్థులు ఆడి పాడి సంబరాలను సంబరంగా నృత్యాలు చేస్తూ కేరింతలతో దాండియా పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశ సంస్కృతి సంప్రదాయాల విశిష్టతలను తెలియజేసే విధంగా విద్యార్థులు ఆడి పాడడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ బతుకమ్మ పండుగలో రంగురంగుల పువ్వులతో అలంకరించి పువ్వులనే పూజించే పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా జి వెంకటేశ్వర్లు, రామ నరసింహారెడ్డి, పాలనాధికారి రామారావు, వైస్ ప్రిన్సిపాల్ సిహెచ్ శశికాంత్, ఆయా విభాగాతిపతులు, మీడియా ఇన్ఛార్జ్ గొంటి రమేష్, లతోపాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.