calender_icon.png 16 January, 2025 | 6:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాత్రూం చెప్పులు @ లక్ష

18-07-2024 12:05:00 AM

న్యూ ఢిల్లీ, జూలై 17: భారత దేశంలో నివసిస్తున్న ప్రతీ మధ్యతరగతి కుటుంబ సభ్యులకు తెలుపు, నీలం రంగులో ఉండే హవాయి చె ప్పుల గురించి తెలిసే ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు పొలాలకు వెళ్లేందుకు, నగరాల్లో ఉండేవారు బాత్రూంకు వెళ్లేందుకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇం డియాలో వీటి ధర రూ.100 నుంచి రూ.400 వరకు ఉండొచ్చు . ఇప్పు డు అవే చెప్పులు సౌదీ అరేబియాలోని ఓ స్టోర్‌లో రూ.లక్షకు అమ్మ కానికి పెట్టారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తి ఇన్‌స్టాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఈ పోస్టుపై భారత దేశ సోషల్ మీడియా వినియోగదారులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వావ్ హవాయి చప్పులు రూ.లక్ష గ్రేట్ అని ఒకరంటే.. మేము ఈ చెప్పులను బాత్రూం వెళ్లేందుకు వాడు తామని మరొకరు కామెంట్ చేశారు.