24-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): సామజిక సేవకుడు బత్తిని రాజుగౌడ్ సేవలను గుర్తించిన అంతర్జాతీయ పీస్ విశ్వవిద్యాలయం ఆదివారం పాండిచ్చేరిలో గౌరవ డాక్టరేట్ అందజేసింది. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ చల్లాద్రి, చీఫ్ డైరెక్టర్ (సౌత్ ఇండియా యూఎస్‌ఐపీసీ) డాక్టర్ ఏ ప్రభోద్ రాజేంద్రన్, ఎస్‌హెచ్‌ఆర్‌డీఓసీ చైర్మన్ డాక్టర్ డీ లక్ష్మీకాంతం, ఎన్‌ఆర్‌వో డైరెక్టర్ డాక్టర్ వల్లపొడి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులు, పేదలు, విద్యార్థులకు రాజుగౌడ్ అందించిన సేవలు అభినందనీయమని వర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ.. అవార్డులు ఆభరణం కాదని, మరింత బాధ్యతను పెంచుతాయన్నారు. అవార్డు అందించినందుకు విశ్వవిద్యాలయ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తోటివారికి సేవచేయడమే తన లక్ష్యమని, మానవ సేవే మాధవ సేవ అని పేర్కొన్నారు.