calender_icon.png 31 October, 2024 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదాద్రి విష్ణుపుష్కరిణిలో స్నాన సంకల్ప ఆర్జిత సేవశ్రీకారం

11-08-2024 01:59:37 PM

యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి కొండ పై గల విష్ణు పుష్కరిణిలో భక్తులకు స్నాన సంకల్ప ఆర్జిత సేవను ఆదివారం నుంచి ప్రారంభించారు. స్వామివారి తిరు నక్షత్రం స్వాతి రోజున ఆలయ అర్చకులు పుషరిణి జలాలకు పూజలు నిర్వహించారు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సభ్యులతో స్నానం ఆచరించి అర్చకుల సంకల్పం తో ఈ ఆర్జిత సేవను అందుబాటులోకి తీసుకు వచ్చారు ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు