ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్
జగిత్యాల అర్బన్, జనవరి 10 (విజయ క్రాంతి): నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పల్లె, బస్తీ దవాఖా నాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణం 10వ వార్డు లింగంపే టలో రూ. 13 లక్షల నిధులతో బస్తీదావ ఖాన, రూ. 3 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి బస్తీ దావఖాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. జగి త్యాల నియోజకవర్గంలో 24 బస్తీ, పల్లె దవాఖానాలు మంజూరయ్యాయని, బస్తీ దవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు అవసర మైన టీకాలు, ప్రాథమిక వైద్య సేవలు అందుతాయన్నారు. బస్తీ దవాఖాన సేవల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పట్టణంలోని 36 వ వార్డు అభివృ ద్ధికి రూ. 1కోటి 20లక్షల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయటం జరిగిందన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డికి మద్దతుగా ఉండి పట్టణాభివృద్ధికై నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ ఛైర్మన్ నాగభూషణం, జిల్లా వైద్యాధికారి ప్రమోద్, కమిషనర్ చిరంజీవి, ఈఈ లక్ష్మణ్ రావు, స్థానిక కౌన్సిలర్ భారతి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.