calender_icon.png 14 March, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధుడిని కాపాడిన బాసర పోలీసులు

13-03-2025 06:08:01 PM

బాసర,(విజయక్రాంతి): కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతు కాలం వెళ్లదీస్తున్న కొందరి అభ్యాగులకు మరణం సరైన నిర్ణయం కాదని జిల్లా ఎస్పీ ఆదేశాలతో బాసర బ్రిడ్జి వద్ద నిరంతర పర్యవేక్షణలో భాగంగా ఓ వృద్ధుడిని కాపాడిన సంఘటన బాసర గోదావరి నది బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. గత 15 రోజుల నుండి నిర్మల్ జిల్లాఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పదిమందిని బాసర పోలీసులు కాపాడారు. 

గురువారం రోజున నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అబ్బపురు గ్రామానికి చెందిన బాపని రామయ్య అనే వృద్ధుడు బ్రిడ్జిపై దూకడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న పోలీసు మోహన్ సింగ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వాచర్ నరేందర్లు వృద్ధుని కాపాడి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల కానిస్టేబుల్ మోహన్ సింగ్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వాచర్ నరేందర్ లను అభినందించారు.