calender_icon.png 5 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక విద్యతోనే పునాది!

05-04-2025 02:11:56 AM

  1. మెరుగైన విద్యావ్యవస్థ రూపకల్పనకు పాలసీ రూపొందించండి
  2. నైపుణ్యాలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలి
  3. భాషా, విషయపరిజ్ఞానం రెండూ ప్రధానమే
  4. విద్యా కమిషన్, విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): రాష్ర్టంలో మెరుగైన విద్యావ్యవస్థ రూపకల్పనకు సమగ్ర పాలసీ (విధానపత్రం) రూపొందించాలని తెలంగాణ విద్యాకమిషన్, విద్యాశాఖకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది బలపడుతుందని.. ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువు ల్లో విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం అభిప్రాయపడ్డారు.

ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకు ఎంత వ్యయమైనా వెనుకాడమని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అద్దం పట్టేలా విధానపత్రం ఉండాలని, అదే సమయంలో అది ఆచరణకు దూరంగా ఉండకుండా చూసుకోవాలని హితవు పలికారు. ప్రస్తుత విద్యావ్యవస్థ లో లోపాలు, తీసుకురావల్సిన సంస్కరణలపై హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)లో విద్యాక మిషన్, విద్యాశాఖలపై సీఎం శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

విద్యా రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధా న్యం, ఉపాధ్యాయుల నియామకం, అమ్మ ఆదర్శ కమిటీలు, పుస్తకాలు, యూనిఫాంల పంపిణీతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాన్ని సీఎం వివరించారు. 

ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోండి..

అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాల స్థా యిలో తీసుకురావల్సిన మార్పులపై సమాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖులతో చర్చించి మెరుగైన విధాన పత్రం రూ పొందించాలని సీఎం సూచించారు. మనకున్న వనరులు సద్వినియోగం చేసుకోవా లని, వి ద్యావ్యవస్థలో తెలంగాణ అగ్రగామిగా ఉం డేందుకు దోహదపడేలా సూచనలు, సలహాలు ఉండాలన్నారు.

వివిధ రాష్ట్రాల్లోని పర్యటనలు, ఆయా రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ప్రాథమిక విద్యలో అనుసరిస్తున్న విధానాల ను విద్యా కమిషన్ చైైర్మన్ ఆకునూరి మురళీ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 1960దశకం నుంచి ప్రస్తుతం వరకు విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు క్రమేణా విద్యార్థుల సృజనాత్మక శక్తి, ఆలోచనాధోరణిని ఎలా హరించి వేశాయో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వివరించారు.

విద్యావ్యవస్థలో మార్పులకు పరీక్షల విధానం, పాఠశాలల్లో తనిఖీలు, జీ వన నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, విద్యాశాఖ కా ర్యదర్శి యోగితారాణా, ప్రాథమిక విద్యాశా ఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి, విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రా వు, చారకొండ వెంకటేశ్, కె.జ్యోత్స్న శివారె డ్డి, పలు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.