30-04-2025 05:49:32 PM
నిర్మల్ (విజయక్రాంతి): మహాత్మా బసవేశ్వరుని మార్గం ఆచరణీయమని నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA BJP leader Maheshwar Reddy) అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను జరుపుకున్నారు. బసవేశ్వరుని విగ్రహానికి పూలమాల వేసి 12 శతాబ్దంలో బసవేశ్వర హైందవ జాతి వ్యతిరేకంగా కుల సామాజిక వ్యవస్థలను మార్చేందుకు లింగయ్య ధర్మాన్ని స్థాపించి సమాజ చైతన్యం కోసం పాటుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమం పార్టీ నాయకులు అచ్యుత్ రావు వీరేష్ కార్తీక్ సాయి తదితరులు పాల్గొన్నారు.