30-04-2025 02:57:29 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ బసవేశ్వర జయంతి వేడుకలు(Basaveshwara Jayanti celebrations) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహాత్మ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నరసింహస్వామి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీమన్నారాయణ రెడ్డి, డిహెచ్ఓ మరియన్న, మత్స్యశాఖ అధికారి వీరన్న, గ్రౌండ్ వాటర్ డిడి వేముల సురేష్, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.