30-04-2025 04:57:04 PM
బైంసా (విజయక్రాంతి): భైంసా పట్టణంలో విశ్వగురు బసవేశ్వర్ మహారాజ్ జయంతి(Basaveshwar Maharaj Jayanti) వేడుకలను బుధవారం వీరశైవ లింగాయత్ బైంసా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని కట్టా హోటల్ వద్ద నిర్వహించిన జయంతి వేడుకల్లో కమిటీ సభ్యులు బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వీరశైవ లింగాయత్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మారుతి నాగభూషణం పాండురంగ మాట్లాడుతూ... 11వ శతాబ్దంలోని విశ్వగురు బసవేశ్వర్ సమాజంలోని రుగ్మతలను తొలగించేందుకు ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. స్త్రీలపై జరుగుతున్న వివక్షత బాల్యవివాల నిషేధం వితంతులకు పునర్వివాహాలు సమాజంలో మహిళలకు గౌరవం నీతివంతమైన పాలన ఆలయాల్లో అన్ని వర్గాల వారికి ప్రవేశం అనే అంశాలతో లింగాయత్ సమాజాన్ని స్థాపించడం జరిగిందని దాన్ని నేటికీ ఆచరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ సభ్యులు పాల్గొన్నారు.