26-03-2025 11:14:10 PM
నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలం మావినల్లి గ్రామంలో శ్రీ చిన్న బసవేశ్వర జాతర మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 19 మార్చి 2025 నుంచి 29 మార్చ్ 2025 వరకు సాయంత్రం ఏడు గంటల నుంచి 8 గంటల వరకు పూజ శ్రీ నిరంజన్ మహాస్వామి హిరేమాట్ సంస్థాన భాల్కిచే నిర్వహించడం జరుగుతుంది. 30వ తేదీ రోజు ఆదివారం రాత్రి 9:30 నుంచి 10: 30 నిమిషాల వరకు పల్లకి ఊరేగింపు, రాత్రి 10 గంటల 30 నిమిషాల నుంచి పూజ్యశ్రీ బసవలింగ పట్టేదెవరు సంస్థాన భల్కి వారిచే ప్రవచన కార్యక్రమం, 31వ తేదీ రోజు ఉదయం ఏడు గంటల 11:00 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కుస్తీ కార్యక్రమం ఉంటుంది.
అంతిమ కుస్తి పోటీలో గెలిచిన వారికి ఐదు తులం వెండి కడియం సిద్దు బిరాదర్ దాతగా బహూకరిస్తున్నారు, మధ్యాహ్నం మహా ప్రసాదం, 30వ తేదీ రాత్రి 11 గంటల నుంచి పంచాయతీ ఫకిర నాటకం ఉంటుంది. ఒకటవ తేదీన చివరి రోజు సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. గ్రామ పెద్దలు శివకుమార్ పటేల్, గ్రామ మాజీ సర్పంచ్ విఠల్ రావు పాటిల్, బస్వరాజు, మనోహర్ పాటిల్, మాజీ జడ్పీటీసీ రూప్సింగ్, జగప్ప గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.