నిర్మల్: బాసర త్రిబుల్ ఐటీలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఐదు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. సోమవారం ఇన్చార్జీ బీసీ వెంకట రమణ విద్యార్థులతో చర్చలు జరిపారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఇన్చార్జి బీసీ వెంకటరమణ విద్యార్థులకు హామీ ఇచ్చరు. దీంతో వారు ఆందోళనలను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ ఆందోళన చేస్తామని విద్యార్థులు తెలిపారు