భైంసా (విజయక్రాంతి): బాసర ఆర్జీయూకేటీ పీయూసీ రెండవ సంవత్సరం విద్యార్థిని మధులత ప్రధానమంత్రి మ్యూజియంలో ఈ నెల 10 తేదీలలో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్ పాల్గొని ప్రత్యేకతను చాటింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రధానమంత్రి మ్యూజియంలో ఆమెను అభినందించారు. ఈ మేరకు ఆమెను బుధవారం ఆర్జీయూకేటీలో వీసీ గోవర్ధన్, అధికారులు మధులతను అభినందించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తి ఇతరత్రా సామాజిక, నైపుణ్య రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.