calender_icon.png 23 February, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బార్లు, వైన్స్ బంద్

22-02-2025 11:15:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, వైన్స్, స్టార్ హోటళ్లు, క్లబ్లులు రెండ్రోజుల పాటు బంద్ చేయాలని కమిషనర్ అవినాష్ మహాంతి(Commissioner Avinash Mohanty) ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలకు ఈ నెల 27న ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనావళికి అనుగుణంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు, ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలు, బార్లు, వైన్స్, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు ఈ నెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల పాటు బంద్ చేయాలన్నారు. నాన్ ప్రొప్రైటరీ క్లబ్‌లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్ లలో మద్యం సరఫరా చేయడానికి అనుమతి లేదన్నారు.