calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బారిష్టర్ నుంచి ప్రధానమంత్రి

06-07-2024 12:42:17 AM

రాజకీయాల్లోకి వచ్చిన 9 ఏళ్లలోనే ఉన్నత స్థాయికి స్టార్మర్ 

లేబర్ పార్టీలో మార్పులు తెచ్చి గెలిపించిన నేత

లండన్, జూలై 5: ఘోర పరాజయాలు చవిచూస్తున్న లేబర్ పార్టీ పగ్గాలను కెయిర్ స్టార్మర్ 2020లో చేపట్టి నాలుగేళ్లలోనే అధికారంలో కూర్చోబెట్టారు. 14 ఏళ్ల తర్వాత అధికారం దక్కేలా కృషి చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన 9 ఏళ్ల వ్యవధిలోనే స్టార్మర్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 2015లో తొలిసారి నార్త్ లండన్ నుంచి పార్లమెంట్‌కు కెయిర్ ఎన్నికయ్యారు.  2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విజ యం సాధించారు.

కానీ ఆ ఎన్నికల్లో లేబర్ పార్టీ 85 ఏళ్లలోనే అత్యంత ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ మరుసటి ఏడాది పార్టీ అధినేతగా స్టార్మర్ బాధ్యతలు స్వీకరించారు. లేబర్ పార్టీలో సంస్కరణలు తీసు కొచ్చి, అనేక మార్పులను తీసుకొచ్చారు.  తాజా ఎన్నికల్లో నాయకత్వంలో 650 సీట్ల కు గాను 412 స్థానాలను లేబర్ పార్టీ కైవసం చేసుకుని ఘన విజయం సాంచి ంది. దీంతో 61 ఏళ్ల స్టార్మర్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగుపెట్టబోతున్నారు. బ్రిటన్‌లో గత 5 దశాబ్దాల్లో ఇంత ఎక్కువ వయసున్న వ్యక్తి ప్రధాని కావడం ఇదే తొలిసారి. 

వ్యక్తిగత వివరాలు.. 

స్టార్మర్ 1962 సెప్టెంబర్ 2న జన్మించారు. ఆయన బాల్యమంతా లండన్ శివార్లలోనే గడిచింది. తల్లి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేవారు. స్టార్మర్ బారిష్టర్ పూర్తి చేశారు. తర్వాత 2003లో నార్తన్ ఐర్లాండ్ పోలీసులకు మానవహక్కుల సలహాదారుగా వ్యవహరించారు.