హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (విజయక్రాంతి): నాంపల్లిలోని పీసీసీ కార్యాలయం గాంధీ భవన్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రియాంకగాంధీపై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు చేసినందు కు నిరసనగా యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టగా, ఓ బీజేపీ కార్యకర్త గాయప డ్డాడు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు పార్టీ కార్యాలయాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.