calender_icon.png 30 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరోడా హ్యాట్రిక్

29-10-2024 12:42:14 AM

ఒడిశాపై ఇన్నింగ్స్ 98 రన్స్ తేడాతో విజయం

  1. గెలుపు దిశగా హైదరాబాద్ 
  2. రంజీ ట్రోఫీ

హైదరాబాద్: రంజీ ట్రోఫీలో బరోడా జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా ఒడిశా తో జరిగిన మ్యాచ్‌లో బరోడా ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బరోడా 456 పరు గులు చేయగా.. ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చాప చుట్టేసింది.

దీంతో ఒడిశాను ఫాలోఆన్ ఆడించగా రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కుప్పకూలింది. దీంతో బరోడాకు ఇన్నింగ్స్ విజయం దక్కిం ది. ఇక ఎలైట్ గ్రూప్-బిలో హైదరాబాద్ తొలి విజయం దిశగా అడుగులు వేస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలు చవిచూసిన హైదరాబాద్.. పాండిచ్చేరితో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం గెలుపు దిశగా పయనిస్తోంది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాండిచ్చేరి 2 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. గంగా శ్రీధర్ రాజు (61 నాటౌట్), అరుణ్ కార్తిక్ (14*) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకే కుప్పకూలిన పాండిచ్చేరిని హైదరాబాద్ ఫాలోఆన్ ఆడిస్తోంది. కెప్టెన్ అరుణ్ కార్తిక్ (20) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 5 వికెట్లతో మెరిశాడు. నేడు ఆటకు చివరి రోజు కావడంతో చేతిలో 8 వికెట్లు మిగిలి ఉన్న పాండిచ్చేరి మరో 212 పరుగులు వెనుకబడి ఉంది. వీలైనంత తొందరగా పాండిచ్చేరిని ఆలౌట్ చేసి ఇన్నిం గ్స్ పరుగుల తేడాతో విజయాన్ని అందుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది.

ఇక హైద రాబాద్ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్ల నష్టానికి 538 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (173) సెంచరీతో రాణించగా.. రోహిత్ రాయుడు (84), హిమతేజ (60) రాణించాడు.  

మయాంక్ సెంచరీ..

ఎలైట్ గ్రూప్ భాగంగా ముంబై, త్రిపుర మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే త్రిపురను తొలి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకు కట్టడి చేసిన ముంబై 148 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

త్రిపుర బ్యాటర్ జివాన్ జోత్ (118) ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 14వ సెంచరీ సాధించగా.. శ్రీదమ్ పాల్ (52), మన్‌దీప్ (62 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో హిమాన్షు సింగ్ 6 వికెట్లు తీయగా.. షామ్స్ ములానీ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక గ్రూప్ బిహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్నాటక మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

సీనియర్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రంజీల్లో 18వ సెంచరీ సాధించగా.. మనీశ్ పాండే అర్థసెంచరీతో రాణించాడు. అంతకముందు బిహార్ 143 పరుగులకు ఆలౌటైంది.