23-02-2025 10:30:02 AM
కష్టానికి తగిన ఫలితం
మరోసారి నియోజకవర్గ బి-బ్లాక్ మహిళా అధ్యక్షురాలుగా బర్ల నాగమణి నియామకం
బూర్గంపాడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ అధిష్టానం మరోసారి పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలుగా బర్ల నాగమణిని నియమించినట్లుగా ఆ పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అలకలంబ(Congress National Women President Alka Lamba) ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతా రావు ప్రకటించారు. ఈ మేరకు శనివారం హైదరాబాదులోని గాంధీభవన్ లో నియామక పత్రాన్ని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు చేతుల మీదుగా అందుకున్నారు. కష్టానికి తగిన ఫలితం పొందడం పట్ల ఆమె అభిమానులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ పట్ల విధేయతగా పనిచేశానని అధికారంలోకి వచ్చినప్పుడు అదే విధంగా పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తన కష్టానికి ప్రతిఫలంగా మరోసారి నాకు పదవి అప్పగించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అలకలంబ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ పట్ల ఎప్పుడు విధేయతగా ఉంటానని అన్నారు.తన వెన్నంటే ఉంటూ నియోజకవర్గంలో మహిళా సభ్యత్వాలు అధికంగా చేసేందుకు తోడ్పాటు అందించిన జిల్లా మహిళా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న అని అన్నారు. ప్రజా ప్రభుత్వం చేపట్టి సంక్షేమ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు చేరే విధంగా ఇంటింటికి సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అందే విధంగా తన వంతు కృషి చేస్తానని అన్నారు.