calender_icon.png 23 September, 2024 | 12:03 AM

మొరాయిస్తున్న మీసేవ!

20-09-2024 12:00:00 AM

  1. రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్యతో నిలిచిన సేవలు
  2. కేంద్రాల చుట్టూ ప్రజలు, విద్యార్థుల ప్రదక్షిణలు

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి):  అన్ని శాఖల సర్వీసులు ఒకే చోట అందించి వినియోగదారులకు సమయాభావం, ఆర్థిక భారాన్ని తగ్గించేం దుకు ప్రవేశపెట్టిన మీసేవలో కొ న్ని రోజులుగా సాంకేతిక కారణాలతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రజలు, విద్యార్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల్లో రుణాల కోసం ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు, విద్యార్థులు కులం, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల కోసం, ఉపకార వేతనాల దరఖాస్తు, లేబర్ కార్డులు సర్వీసులు, జన న, మరణ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి సర్వీసులేవీ పని చే యడం లేదు. నిత్యం రద్దీగా ఉండే మీసేవ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

క్యూర్ కోడ్‌తో ఇబ్బందులు

మీసేవ కేంద్రాల్లో సర్వీసు చెల్లింపులకు గాను ఇటీవల క్యూఆర్ కోడ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనితో చెల్లింపులు సరిగా కాక లావాదేవీలు ముందుకు సాగడం లేదని మీసేవ నిర్వాహకులు వాపోతున్నారు. సె ప్టెంబరు 12కు ముందు మీసేవ కేంద్రా లలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు డిపార్ట్‌మెం ట్ లాగిన్లలో కని పించడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక వేళ దరఖాస్తు ఆమోదించినా మీసేవ కేంద్రంలో ప్రింట్ రావడం లేదని చెప్తున్నారు. సర్వీసులు సరిగా పని చేయక వినియోగదా రులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నా కొందరు తమ బాధను అర్థం చేసుకోవడం లేదని మీసేవ నిర్వాహకులు పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మీసేవ సర్వీసులను యదావిధిగా పునరుద్ధరించాలని ప్రజ లు కోరుతున్నారు.

సాంకేతిక సమస్యతో సర్వీసులు నిలిచాయి 

స్టేట్ డేటా సెంటర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మీసేవ ద్వారా అందజేస్తున్న సర్వీసులన్నీ నిలిచిపోయాయి. సాంకేతిక సిబ్బంది సమస్య లను పరిష్కరించడంలో శ్రమిస్తున్నా రు. త్వరలో పూర్తిస్థాయిలో సర్వీసులన్నీ పునరుద్ధరించబడుతాయి.

 ప్రశాంత్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్, మహబూబాబాద్ జిల్లా

మరోసారి దరఖాస్తు చేసుకోమంటున్నారు

పది రోజుల క్రితం మీ సేవలో ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాను. తహసీల్దారు కార్యాలయం లాగిన్‌లో వివరాలు కనపడటం లేదని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేను మళ్లీ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంపై అధికారులు చొరవ తీసుకోవాలి.  

 మానస, విద్యార్థిని, కేసముద్రం

సర్వర్ సమస్యతో సర్వీసులు రావడం లేదు

గత కొన్ని రోజులుగా మీసేవలో సర్వీసులో అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో రెవెన్యూ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్, లేబర్ తదితర సర్వీసులేవీ పని చేయడం లేదు. ఈ విషయాన్ని చెప్పగా ప్రజలు కొందరు అర్థం చేసుకుంటున్నారు. మరి కొందరు దురుసుగా మాట్లాడుతున్నారు. 

 మహేశ్, మీసేవ నిర్వాహకుడు