నార్సింగి: రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. ఈ ఘటన నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాజు(50) అనే బార్బర్ ను మరో బార్బర్ అతి కిరాతకంగా గొంతుకోసి చంపేశారు. హత్య చేసిన అనంతరం నిందితుడు నార్సింగ్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.
నిందితుడిన తీసుకొని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ హత్య కుటుంబ కలహాలతోనే జరిగినట్లు సమాచారం, నిందితుడు మృతుడికి బందువుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.