29-03-2025 12:32:39 AM
పర్మిట్ రూంలను నిబంధనల ప్రకారం నడపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో,(విజయక్రాంతి): బార్‌ల పక్కన ఉన్న బెల్ట్ షాప్‌లను ఎత్తివేయాలని బార్‌ల యజమానులు డిమాండ్ చేశారు. శుక్రవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైన్స్‌లలో నిబంధనల ప్రకారం పర్మిట్ రూంలను నడపాలని, అక్కడ కుర్చీలు వేయకూడదని, తినుపదార్థాలను అమ్మకూడదన్నారు. కరోనా నుంచి తాము నష్టాల్లో ఉన్నామని, గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వంసహకరించాలని కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తోందని, కానీ తాము ఇంకా లైసెన్స్ ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. రెవెన్యూ పరంగా ఇబ్బందులు పడుతున్నామనిచెపాపరు. లైసెన్స్ ఫీజులు కట్టకుంటే అధికారులు పెనాల్టీలు వేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్స్ బంద్ అయ్యాక బార్లలోకి కస్టమర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి బెల్టు షాపులే కారణమని ఆరోపించారు. ప్రజలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలన్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బార్‌లలో ఒక్కో చోట 30 పని ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 10 నుంచి రాత్రి 10గంటల వరకే వైన్ షాపులకు అనుమతి ఉందని, కానీ జీహెచ్‌ఎంసీ పరిధిలో రాత్రి 11గంటల వరకు కొనసాగుతున్నాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.