27-03-2025 12:44:32 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు(Bellampalli Junior Civil Court)లో గురువారం ఉదయం 10 గంటల నుండి బార్ అసోసియేషన్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికలలో 49 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకొని కొత్త అసోసియేషన్ ఎన్నుకోబోతున్నారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు గాను 6 గురు న్యాయవాద అభ్యర్థులు పోటీ పడుతుండగా 7 పదవులకు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు సివిల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు కొనసాగనున్నాయి.