calender_icon.png 21 March, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న బార్ అసోసియేషన్ ఎన్నికలు

19-03-2025 12:00:00 AM

నేడు, రేపు నామినేషన్ల స్వీకరణ

జనగామ, మార్చి 18(విజయక్రాంతి): ఈ నెల 27న జనగామ బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి శ్రీరాములు శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులు డి.సురేశ్, జి.రాజశేఖర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

జనగామ బార్ అసోసియేషన్‌కు సంబంధించి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవితో పాటు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, లైబ్రరీ సెక్రటరీ, కోశాధికారి, స్పోరట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ, లేడీ రిప్రెసింటేటీవ్, ఐదుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్లకు గానూ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ నెల 19, 20 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తామని, 21న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వివరించారు. 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని శ్రీరాములు శ్రీనివాస్ వెల్లడించారు.