calender_icon.png 28 September, 2024 | 4:49 AM

ప్రజా పోరాట యోధుడు బాపూజీ

28-09-2024 02:52:12 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో ఉద్యమకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిగా నిలిచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎక్స్‌వేదిక స్పందిస్తూ స్వాతంత్ర పోరాటం నుంచి మొదలు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో బాపూజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమని కొనియాడారు.

రాష్ట్ర సాధనకు సాగిన సుదీర్ఘ ఉద్యమానికి ఆయన ఎన్నో సేవలు అందించారని, కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ ఆయన నివాసంలోనే పురుడు పోసుకున్నదని గుర్తుచేశారు.