calender_icon.png 7 January, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామెడీ ఎంటర్‌టైనర్‌గా బాపు

31-12-2024 01:39:20 AM

కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ తన మూడవ ప్రొడక్షన్‌ని అనౌన్స్ చేసింది. ఇది డార్క్ కామెడీ- డ్రామా, హ్యుమర్, ఎమోషన్స్ కలబోతగా ఉండనుంది. బ్రహ్మాజీ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని దయా రూపొందిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కథలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి ‘బాపు’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం లాంచ్ చేశారు. డైనింగ్ చైర్‌లో కూర్చున్న ఓ తండ్రి చుట్టూ కుటుంబమంతా చుట్టూ చేరి, అతనికి ఇష్టమైన వంటకాలను వడ్డించే దృశ్యాన్ని పోస్టర్‌గా చిత్ర యూనిట్ వదిలింది.

కుటుంబ సభ్యులంతా వేర్వేరు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. ‘బాపు’ చిత్రం నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఓ వ్యవసాయ కుటుంబం ఎమోషనల్ జర్నీగా ఉండనుంది.