కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సోమవారం ప్రభుత్వ వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరమర్శించారు. బాన్సువాడకు చెందిన షేక్ హకీమ్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని, కోర్టు కాలనీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి శ్రీకాంత్ తండ్రి మృతి చెందడంతో శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.