calender_icon.png 6 April, 2025 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్న బాణోత్ మదన్ లాల్

05-04-2025 10:46:40 PM

కేసీఆర్, కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్..

వైరా (విజయక్రాంతి): హైదరాబాదులో ఎర్రవల్లి మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ నివాసంలో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో వైరా మాజీ శాసనసభ్యులు వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ బాణోత్ మదన్ లాల్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేసీఆర్, కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మదన్లాల్ తనయుడు జవహర్లాల్ మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైరా నియోజక వర్గ రాజకీయ పరిస్థితులను వారు అడిగి తెలుసుకున్నారు. పార్టీ పురోభివృద్ధిపై కొంతసేపు చర్చించారు. పలు విషయాలపై వారు మదన్ లాల్ కు దిశా నిర్దేశం చేశారు.