calender_icon.png 27 December, 2024 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేఅవుట్లలో రిజిస్ట్రేషన్ల బంద్ దుర్మార్గం

03-11-2024 02:04:23 AM

  1. పేదలు కొనుగోలు చేసిన ప్లాట్లకు కొత్త నిబంధనలు సరికాదు
  2. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): హెఎండీఏ పరిధిలోని గ్రామ పంచాయితీ లే అవుట్లలోని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపేయడం ప్రభుత్వ మూర్ఖత్వ చర్యేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పరిపాలన అనుభవం లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి తీసుకుం టున్న నిర్ణయాలతో ప్రజలు బ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జీపీల్లో వేలాదిగా లే అవుట్లు వెలిశాయని, వాటి క్రయవిక్రయాలు కూడా ఎంతో మంది చేతులు మారాయన్నారు.

ఇప్పుడు వాటికి ఎవరినీ బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా చేస్తామంటూ నమ్మబలికి ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టిన వాళ్లను కూడా ఆగం చేసే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. 

తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులు 

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. శనివారం ఎక్స్‌వేదికగా రాష్ట్రవ్యాప్తంగా పోలీ స్ యాక్ట్ అమలుపై స్పందిస్తూ ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ వెనకటి రోజు లొచ్చాయని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. 

పశుసంపదలోనూ అగ్రస్థానం..

కేసీఆర్ హయాంలో రాష్ట్రం పంట దిగుబడిలోనే కాకుండా పశుసంపదలోనూ అగ్రస్థానంలో నిలిచామని కేటీఆర్ తెలిపారు. కులవృత్తులకు కేసీఆర్ కొండంత అండగా నిలవడంతో పశుసంపదలో గణనీయ వృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ లో డిమాండ్‌కు తగ్గట్టు ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం చేశామని, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం వచ్చే వందలాది లారీల దిగుబడికి పదేళ్లలో కళ్లెం పడిందన్నారు.