22-04-2025 12:40:21 AM
అధిక ధరలకు విక్రయించి సొమ్ముచేసుకుంటున్న వ్యాపారులు రోగాల పాలవుతున్న యువత గుట్కా అమ్మకాలు రాష్ట్రంలో నిషేధం కానీ బహిరంగ మార్కెట్లో మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయి.
పట్టణా లనుంచి మొదలుకొని మారుమూల గ్రామా లలోని ఏ కిరాణా షాప్ దగ్గరికి వెళ్లిన గుట్కాలు అందుబాటులో ఉంటున్నాయి. నిషేధిత గుట్కా లపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో గుట్కా విక్రయదారులు మూడు పువ్వులు అరు గుట్కాలుగా దందాను యదేచ్చగా నడుపుతున్నారు.
వనపర్తి, ఏప్రిల్ 21 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లు దందా వనపర్తి, గద్వాల జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గంజాయి ఇతర మత్తు పదార్థాలతో పాటు ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలా, తంబాకు ఉత్పత్తులను పూర్తిగా నిషేధించింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి...
గుట్కా, తంబాకు, పాన్ మసాలా ఉత్పత్తులను పక్క రాష్ట్రాలైన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుండి గద్వాల తో పాటు వనపర్తి జిల్లాలో రవాణా జోరుగా సాగుతుంది. హైదరాబా ద్ నుండి కొంత మంది వ్యాపారులు రాత్రి వేళలో జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారని విమర్శలు సైతం ఉన్నాయి. పట్టణాలతో మొదలుకొని గ్రామాల వరకు ఈ దందా కొనసాగుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం వెనుక పలు విమర్శలకు దారితీస్తున్నాయి
రోగాల బారిన..
గుట్కా పాన్ మసాలా తంబాకు వివిధ రకాల ఉత్పత్తులను తీసుకున్న వారు అనారోగ్యానికి గురవుతున్నారని క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వం నిషేధించింది. సంబంధిత అధికారులు ఈ గుట్కా దందాపై దృష్టి సారించకపోవడంతో కొన్ని కిరాణా షాపుల్లో పాన్ షాపుల్లో గ్రామాల్లోని దుకాణాలలో గుట్కాలు యదేచ్చగా దొరుకుతున్నాయి.
వీటికి అలవాటు పడిన వారు అనారోగ్యానికి గురవుతున్నా రు. వనపర్తి, గద్వాల జిల్లా కేంద్రాలలో బీ హార్ ఉత్తర ప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు భవన నిర్మాణాలు ఇతర కార్మికులుగా పనిచేస్తున్నారు. వారిలో దాదాపు ఎక్కువ మటుకు గుట్కా ప్యాకెట్లు తీసుకొని అనారోగ్యానికి గురి అవుతున్నారు.
అధిక రేట్లకు విక్రయాలు
జిల్లా లోని కొంతమంది బడా వ్యాపారులు పక్క రాష్ట్రాల నుండి గుట్కా ప్యాకెట్ల ను భారీగా దిగుమతి చేసుకొని కిరాణా షాపులకు పాన్ షాప్ లకు సరఫరా చేస్తున్నారు. గుట్కాలు, పాన్ మసాలా తంబాకు
ఉత్పత్తులకు రకరకాల పేర్లను పెట్టి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఈ గుట్కా ప్యాకెట్లు అమ్మకాలపై నిషేధం ఉండడంతో మార్కెట్లో భారీగా డిమాండ్ ఉండడంతో ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు ఎమ్మార్పీకి కాకుండా అధిక రేట్లకు అమ్మకాలు చేపడుతున్నట్లు సమాచారం.
చర్యలు మాత్రం శూన్యం
ప్రభుత్వం నిషేధించిన గుప్తవిక్యాలు జిల్లాలో జోరుగా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు దృష్టి సారించ డం లేదని విమర్శిస్తున్నారు. కొన్ని షాపుల్లో బహి రంగంగా అమ్ముతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జరుగుతు న్న గుట్కా దందాను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.