calender_icon.png 11 February, 2025 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో మళ్లీ నిషేధిత బ్రౌన్ షుగర్ కలకలం

11-02-2025 02:06:11 PM

రూ.2లక్షల విలువైన 41గ్రాముల బ్రౌన్ షుగర్ రెండు మొబైలే ఫోన్లను స్వాధీనం

ఇద్దరు నిందితుల అరెస్టు

శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): హైదరాబాద్ మహా నాగరంలో బ్రౌన్ షుగర్(Brown Sugarమరోసారి పట్టుబడ్డింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి నిషేధిత బ్రౌన్ షుగర్(Banned Brown Sugar) తీసుకువచ్చి హైదరాబాద్ నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు(Shamshabad DTF Police) అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్డా జిల్లాకు చెందిన అలీఉల్(27) తన స్వస్థలం మాల్డా జిల్లాలో గ్రాముకు రూ.1500 చొప్పున బ్రౌన్ షుగర్ ను కొనుగోలు చేసి నగరానికి చేరుకున్నాడు.

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగూడ సుమధుర ఒలింపస్ లేబర్ కాలనీలో పనిచేస్తున్న తన స్నేహితుడు ఎస్కె నాసిముల్ (27)ను కలిసి తాను తెచ్చిన బ్రౌన్ షుగర్ ను  గ్రాముకు రూ.5 వేల చొప్పున విక్రయించేందుకు రంగం సిద్ధం చేశాడు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ పోలీసులు నానక్ రాంగూడ సుమధుర లేబర్ కాలనీలో రూమ్ నెంబర్ 13లో తనిఖీలు నిర్వహించేసి వారి వద్ద నుంచి రూ.2 లక్షల విలువైన 41 గ్రాముల బ్రౌన్ షుగర్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు పేర్కొన్నారు.