రూ 60 కోట్ల విలువ గల ఆల్ప్రాజోలం, ఆల్ప్రాజోలేతర వస్తువులు స్వాధీనం
పోలీసుల అదుపులో నిందితులు
జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి, (విజయక్రాంతి): నిషేధిత ఆల్ప్రాజోలం డ్రగ్ తయారీ ముఠాను అదుపులోకి తీసుకొని రూ. 60 కోట్ల విలువ గల ఆల్ప్రాజోలం, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరు రూపేష్ తెలిపారు. శనివారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గత నెల డిసెంబర్ 31న గుమ్మడిదల పోలీసు స్టేషన్ పరిధిలోని గుమ్మడిదల, సిసియస్ పోలీసులు ముత్తంగి గ్రామానికి చెందిన సుధీర్ గౌడ్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేశామన్నారు. ఏ1 సుధీర్ గౌడ్ తన ఫోర్డ్ కార్ TS 15 FD 2767 లో ముత్తంగి నుండి మెదక్ వెళ్తున్నట్లుగా గుర్తించి, అతని వాహనాన్ని మంబాపూర్ గెట్ వద్ద పట్టుకుని విచారించగా సుధీర్ గౌడ్ పై కేసులో తన నేరాన్ని అంగీకరించి, ప్రస్తుతం కూడా అల్ప్రాజోలంను అమ్ముటకు గాను మెదక్ వెళుతున్నట్లుగా తెలిపారు.
ఏ1-గిర్మగౌని సుధీర్ గౌడ్( 47) రియల్ ఎస్టేట్ బిజినెస్, గ్రామము: తన్మయి హోమ్స్ ముత్తంగి గ్రామం, పటాన్ చెర్వు, మండలం అన్నారు. మెదక్ కు పట్టణంలో పిట్లంబేస్ చెందిన వ్యక్తి అని తెలిపారు. జీవనోపాది కోసం బీరంగూడలో నివాసం ఉంటూ, డబ్బు సంపాదన మీద దూరాశతో 2014 సుధీర్ గౌడ్ అతని భార్య శ్రీవాణి , తమ్ముడు ప్రభుగౌడ్ లు కమిషన్ కు కల్లులో కలిపే నిషేదిత అల్ప్రాజోలం మత్తు మందును అమ్మడం ప్రారంభించారన్నారు. 2017లో కానుకుంటకు చెందిన విశాల్ గౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుండి అల్ప్రాజోలం తీసుకొని నమ్మకం చేశారన్నారు. 2020 లో గుమ్మడిదలకు చెందిన సాయిగౌడ్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతని నుండి అల్ప్రాజోలం కొని అమ్మేవాళ్లు. ఆ తరువాత విశాల్ గౌడ్ ముత్తంగికి చెందిన బీశ్వేశ్వర్ సింగ్ ను పరిచయం చేయగా, అప్పటి నుండి వీరందరూ కలిసి ఈ నిషేదిత అల్ప్రాజోలం వ్యాపారం చేస్తూ.. కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక, అట్టి వ్యాపారంలో అధిక లాభాలను చూసి, సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని, బీశ్వేశ్వర్ సింగ్ కు అల్ప్రాజోలంను తయారు చేసే పద్దతి తెలుసుకొని సొంతంగా అల్ప్రాజోలంను తయారు చేసి అధిక డబ్బులు సంపాదించడం ప్రారంభించారన్నారు.
2023లో హైదరాబాద్ శివారులోని, అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాచారం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 39 గల దానిలో లక్ష్మణ్ గౌడ్, సాయి ప్రియ కెమికల్స్ కంపెనీని కొనుగోలు చేసినందుకు నిర్ణయించుకున్నారన్నారు. ముత్తంగికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేశ్వర్ శర్మను బీశ్వేశ్వర్ సింగ్ పరిచయం చేయగా ముగ్గురు కలసి 2023 మే నెలలో లక్ష్మణ్ గౌడ్ కంపనీని కొనుగోలు చేసి, అట్టి కంపెనీలో నిషేదిత అల్ప్రాజోలంను తయారు చేసే మిషనరిని ఏర్పాటు చేసుకొని, సుధీర్ డ్రైవరు బోడ శశి కుమార్ సహాయంతో అల్ప్రాజోలం తయారికి కావాల్సిన ముడిపదార్దాలను కొనుగోలు చేసి, ఒక బ్యాచ్ -50 కిలోల చొప్పున, నెలకు 1-2 బ్యాచ్ ల అల్ప్రాజోలంను తయారు చేసి కేజి 4 లక్షల చొప్పున హైద్రాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలలో అమ్మి అధిక డబ్బును సంపాదించడం ప్రారంభించారన్నారు. బిశ్వేశ్వర్ సింగ్ ( 43) నివాసం ప్లాట్ నెం. 171, రామరాజు నగర్, పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని బాలేశ్వరం జిల్లాలోని జలుసర్ మండలం, సాలికుంట గ్రామం అన్నారు. రాజేశ్వర శర్మ జోషి ( 41) నివాసం H. నెం: 2-7, పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం తెలిపారు.
గిర్మగౌని శ్రీవాణి ( 38) ప్లాట్ నెం: 53, తన్మయి హోమ్స్, పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామం లో నివాసం ఉంటున్నారన్నారు. వీరిది మెదక్ పట్టణంలోని H. నెం: 2-4-57/A. , పిట్లం బేస్ అన్నారు. బోడ శశి కుమార్ (30), ఎస్సీ (మాల), డ్రైవర్, ఇంటి స్థలం నెం: 1A/11, న్యూ బహార్, సహారా ఎస్టేట్ కాలనీ, ఆటో నగర్, హైత్ నగర్, హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారన్నారు. నల్గొండ జిల్లాలోని పెద్దాపురం మండలం చింతపల్లి గ్రామం గ్రామం అన్నారు. వీరు నుంచి 740 గ్రాముల నిషేధిత ఆల్ప్రాజోలం, 3- కార్లు, 6 సెల్ ఫోన్ లు స్వాధీన చేసుకున్నామన్నారు. వీరి వద్ద రూ. 60 కోట్ల విలువ గల ఆస్థులు గుర్తించడం జరిగింది. వట్పల్లి సంగమేశ్వర్ గౌడ్ , విశాల్ గౌడ్ , కనుకుంట గ్రామం, సాయి గౌడ్ నివాసం గుమ్మడిదల, శ్రీకాంత్ నివాసం మేడ్చల్, మంగ శ్రీనివాస్ గౌడ్ నివాసం మెదక్,. తొగిట రాజ శేఖర్ నివాసం మెదక్, సుధాకర్ నివాసం కూచన్‌పల్లి (A6 - A14 పరారీలో ఉన్నారన్నారు.కలాలి అశోక్ గౌడ్ ( 46 ) ముదిమాణిక్యం గ్రామం, పుల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా అన్నారు. లింగన్నగారి నారాయణ మూర్తి గౌడ్ ( 50) తాలేల్మా గ్రామం, ఆంధోల్ మండలం, సంగారెడ్డి జిల్లా నివాసులు అని తెలిపారు.
డాలరి సాయిలు, రాజు(51) , గదిపెద్దాపురం గ్రామం, అల్లాదుర్గం మండలం, మెదక్ జిల్లా,వీరిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించడం జరిగిందన్నారు. ఆల్ప్రాజోలం కలిపిన కల్లు స్లో పాయిజన్ వంటిది, అనేక మంది యువకులు,విద్యార్థులు డ్రగ్స, గంజాయి, మాదకద్రవ్యాలకు అలవాటు పడి, వివిధ రకాల నేరాలు చేయడం , ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుందన్నారు. ఈ డ్రగ్ మహమ్మారి మత్తులో అనేక మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు, వారిని నమ్మిన అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కావున యువత/విద్యార్థులు డ్రగ్స్/గంజాయి బారిన పడవద్దని సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ, TG-NAB, పోలీసుల తెలుపుతున్నారు. జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ పరిసర ప్రాంతాలలో ఏదైనా అనుమానిత, రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లైతే వెంటనే జిల్లా పోలీసులకు S-Nab నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంఘవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి, డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీవంతు పాత్ర ఉండాలని ఎస్పీ గారు జిల్లా ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, సిసియస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, జిన్నారం ఇన్స్పెక్టర్ నయీముద్దీన్, గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి, సిసియస్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.